- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fire: చూస్తుండగానే కాలిపోయిన లారీ
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అందరూ చూస్తుండగానే క్షణాల్లో లారీ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా(Anantapur District) గార్లదిన్నె మండలం తిమ్మంపల్లి(Thimmampally)లో జరిగింది. గన్నీ సంచుల లోడ్‌తో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. అయితే తిమ్మంపల్లి సమీపంలో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ లారీలో నుంచి బయటకు దూకేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే లారీతో పాటు గన్నీ సంచులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎండల తీవ్రతల వల్ల ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
Next Story