సందర్శకులకు,వాకర్స్‌కు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి : వనపర్తి కలెక్టర్

by Aamani |
సందర్శకులకు,వాకర్స్‌కు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి : వనపర్తి కలెక్టర్
X

దిశ,వనపర్తి: సందర్శకులకు,వాకర్స్ కు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట ఏకో పార్క్ ను జిల్లా కలెక్టర్, జిల్లా అటవీశాఖాధికారి కే ఏ వి ఎస్ ప్రసాద్ రెడ్డితో కలిసి సందర్శించారు.ఏకో పార్కులోని 700 మీటర్ల వాకింగ్ ట్రాక్ పై నడుస్తూ పరిశీలించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సైక్లింగ్ ట్రాక్ సహా, వాకర్స్ కు ఆహ్లాదకరంగా ఉండేలా వివిధ రకాల మొక్కలను నాటించాలని సూచించారు. నిత్యం పార్క్ కి వచ్చే వాకర్స్ కి ఇబ్బందులు కలగకుండా ట్రాక్ నిర్వహణ చేయాలన్నారు.పార్క్ కు వచ్చేవారికోసం ఎంట్రెన్స్ వద్ద, ఇంకా పార్క్ లోని పలు ముఖ్యమైన ప్రదేశాల్లో ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉండేలా,చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశంలో జంతువుల బొమ్మలు సహా ఇతర అదనపు ఆట సామాగ్రి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అటవీశాఖ అధికారులు, ఇతర సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Next Story

Most Viewed