IPL 2025 : ఆర్సీబీ 10 రెట్లు మెరుగ్గా ఉంది : ఏబీ డివిలియర్స్

by Harish |
IPL 2025 : ఆర్సీబీ 10 రెట్లు మెరుగ్గా ఉంది : ఏబీ డివిలియర్స్
X

దిశ, స్పోర్ట్స్ : గత సీజన్‌లతో పోలిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి 10 రెట్లు మెరుగ్గా ఉందని ఆ జట్టు మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ శుభారంభం చేసింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్నది. తాజాగా ‘ఏబీ డి విలియర్స్ 360’ పాడ్‌కాస్ట్‌లో అతను మాట్లాడుతూ.. ఆర్సీబీకి ఇదే అత్యుత్తమ ఆరంభం అని తెలిపాడు. ‘ఆర్సీబీకి గొప్ప ఆరంభం దక్కింది. టైటిల్ గెలుస్తామని మేము చెప్పడం లేదు. కానీ, ఆర్సీబీకి అత్యుత్తమ ఆరంభం అని మాత్రం చెప్పగలను. ఫలితాల కోణం నుంచి మాత్రమే కాదు. జట్టు కనిపిస్తున్న తీరు, స్వేచ్ఛగా ఆడుతున్న విధానం, ప్రత్యర్థి జట్ల మైదానాల్లో ఆడుతున్న తీరు చూసి చెబుతున్నా. వేలం సమయంలో ఆర్సీబీ బ్యాలెన్స్ గురించి మాట్లాడాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో సమతుల్యత అవసరం. ప్రత్యామ్నాయ ప్లేయర్లు అవసరం. తొలి మ్యాచ్‌లో భువీ ఆడలేదు. కానీ, చెన్నయ్‌తో మ్యాచ్‌లో అతను తుది జట్టులోకి వచ్చాడు. అలాంటి బ్యాలెన్స్, డెప్త్ అవసరం.’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed