Jio Offers: జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీకిది తెలుసా?

by D.Reddy |
Jio Offers: జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీకిది తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు దాదాపు 46కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. జియో (Jio) కస్టమర్లకు రిలయన్స్ (Reliance) సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. నెల నెల రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఏడాది పాటు అద్భుతమైన సర్వీసులను అందించే రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు OTT సబ్‌స్ర్కిప్షన్లను సైతం అందిస్తోంది. మరీ ఆ ప్లాన్ల వివరాలేంటో తెలుసుకుందామా.

జియో ప్లాన్ ధర రూ. 3599తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజుకు 2.5GB డేటా పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ తర్వాత స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. ఇందులో జియో ట్రూ 5G సర్వీసులను కూడా పొందవచ్చు. అలాగే, 90 రోజుల పాటు జియో సినిమా ప్రీమియం, క్లౌడ్ స్టోరేజ్‌తో 365 రోజుల సర్వీస్‌ను అందిస్తుంది.

అలాగే, రూ.3,999తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, హైస్పీడ్ డేటా రోజుకు 2.5GB, 100SMS, జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ 90 రోజుల సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా 50GB క్లౌడ్ స్టోరేజీ (Jio AI Cloud) బెనిఫిట్స్ పొందవచ్చు. ఎక్కువగా డేటా వినియోగించే వారికి ఇది ఇవి బెస్ట్ ప్లాన్స్ అని చెప్పవచ్చు.

Next Story

Most Viewed