- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భూముల సమస్యల పరిష్కారం కోసమే భూ భారతి : కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్

దిశ, అనంతగిరి : భూముల సమస్యల పరిష్కారం కోసమే భూ భారతి చట్టం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామం (ఎస్ డబ్ల్యూసీ గోడౌన్) ఏర్పాటు చేసిన భూభారతి చట్టం పై అవగాహన సదస్సుకు కలెక్టరు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా ఆర్డీవో సూర్యనారాయణ కలెక్టర్ సమక్షంలో రైతులకు భూభారతి చట్టం విధివిధానాల పై ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి ధరణిలోని సమస్యలను తొలగించి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, దీని వలన ప్రతి ఒక్కరి భూ సమస్యలకు పరిష్కారం కలుగుతుందని అన్నారు. ధరణిలో సమస్యలను, దాని వల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. అనంతగిరి మండల రైతులు ఈ భూభారతి చట్టం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవం కలిగిన రిటైర్ ఉద్యోగులు, నిపుణులు ఎంతో మందితో చర్చించి ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందిందన్నారు.
ధరణిలో రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారలు, హక్కులు లేకుండా, ప్రతి సమస్యకు కోర్టుకు వెళ్లవలసి ఉండేదని, ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్లలేనందున అధిక సంఖ్యలో సమస్యలు మిగిలిపోయాయని కలెక్టరు తెలిపారు. కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా భూ భారతి చట్టంలో తహశీల్దారు స్థాయి నుండి సీసీఎల్ఎ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే వెసలుబాటు కల్పిస్తామన్నారు. ధరణిలో భూ కొనుగొలు, అమ్మకాలే కాకుండా భూరికార్డులలో పేర్ల మార్పులకు కూడా చాలా ఇబ్బంది కలిగిందని అన్నారు. ధరణిలో నష్టపోయినవారు ఇప్పటికి కొత మందికి న్యాయం జరగలేదని, భూ భారతి చట్టం ద్వారా భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.ఈ భూధార్ విజయవంతమైతే భవిష్యత్తు తరాలకు ఎలాంటి భూ ఆక్రమణ సమస్యలు ఉండబోవన్నారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు 18 నిబంధనలున్నాయని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్మార్వో హిమబిందు, మండల ఇన్చార్జి శ్రీనివాస్, నాయకులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర పుల్లారెడ్డి, గునుకుల గోపాల్ రెడ్డి, బద్దం, కృష్ణారెడ్డి, బాబు నాయక్, డేగ కొండయ్య, కొనతం ఉమా, స్వరూప రెడ్డి, ఆయా గ్రామాల రైతులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.