PM Modi: దేశ భవిష్యత్ ని మరో వెయ్యేళ్ల పాటు తీర్చిదిద్దుతాం- మోడీ

by Shamantha N |
PM Modi: దేశ భవిష్యత్ ని మరో వెయ్యేళ్ల పాటు తీర్చిదిద్దుతాం- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ భవిష్యత్ ను మరో వెయ్యేళ్ల పాటు తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో జ‌రిగిన 17వ సివిల్ స‌ర్వీసెస్ డే(Civil Services Day) సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానాలు, తాము తీసుకుంటున్న నిర్ణ‌యాలు దేశ భవిష్యత్ ని తీర్చిదిద్దుతాయని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధి ముఖ్యమని.. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం సహా ఏ ఒక్క పౌరుడిని వదలకుండా అభివృద్ధి సాగాలన్నారు. భార‌త్‌లో ఆకాంక్షలతో కూడిన సమాజమని.. ఆ కలలన్నీ సాకారం చేసుకునేందుకు అమితమైన వేగంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పాలన, పారదర్శకత, ఆవిష్కరణలలో దేశం కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని ఆయన అన్నారు. ఇది టెక్నాల‌జీ యుగ‌మ‌ని, అయితే వ్య‌వ‌స్థ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా మేనేజ్ చేయ‌డ‌మే ప‌రిపాల‌న అని ప్ర‌ధాని తెలిపారు. ప్ర‌భుత్వ పథకాలు ప్రజలకు చేరిన తీరు వల్లే పరిపాలనా నాణ్యత తెలుస్తుందన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో భార‌త్ అసాధార‌ణ రీతిలో మార్పుల‌ను చ‌విచూసింద‌న్నారు.



Next Story

Most Viewed