- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Jalianwala bagh: ఆ విషయంలో భారత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. బ్రిటన్ ఎంపీ బ్లాక్ మన్

దిశ, నేషనల్ బ్యూరో: భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత విషాదకరమైన 1919 జలియన్ వాలాబాగ్ (Jalianwal bagh) ఊచకోతకు భారత ప్రజలకు అధికారికంగా క్షమాపణ చెప్పాలని బ్రిటన్‌లోని ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ (Bab blackman) బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ ఘటన వల్ల జరిగిన దురాగతాలను గుర్తించి ఏప్రిల్ 13 లోపు సారీ చెప్పాలని తెలిపారు. తాజాగా ఆయన బ్రిటన్ పార్లమెంటులో మాట్లాడారు. ‘జలియన్ వాలాబాగ్ ఊచకోత బ్రిటిష్ సామ్రాజ్యంపై ఒక మచ్చ. ఈ దారుణ ఘటనలో 1500 మంది అమాయక ప్రజలు మరణించగా, 1200 మంది గాయపడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై ఈ మరకకు జనరల్ డయ్యర్ నిందలు ఎదుర్కొన్నాడు. బ్రిటిష్ వలస చరిత్రలో అవమానకరమైన గుర్తుగా మిగిలిపోయింది. కాబట్టి తప్పు జరిగిందని అంగీకరించి, భారత ప్రజలకు అధికారికంగా క్షమాపణ చెప్పారా లేదా అని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేయాలి’ అని తెలిపారు. 2019లో అప్పటి ప్రధానమంత్రి థెరిసా మే ఈ ఊచకోతను అంగీకరించారని, కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదని చెప్పారు.
కాగా, స్వాతంత్రోద్యమం జరుగుతున్న రోజుల్లో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చారు. విచారణ లేకుండా నిర్బంధించడం, రహస్యంగా విచారణ చేపట్టడం ఈ చట్టం ఉద్దేశ్యం. దీనిపై భారతీయ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ వద్ద ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వారిపై కాల్పులు జరపాలని జనరల్ డయ్యర్ ఆదేశించారు. దీంతో బ్రిటీష్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించారు.