Nagpur: నాగ్ పూర్ లో ప్రధాని మోడీ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

by Shamantha N |
Nagpur: నాగ్ పూర్ లో ప్రధాని మోడీ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
X

దిశ, నేషల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నాగ్ పూర్ లో ఆదివారం పర్యటించనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కోసం 250 పడకల ఆసుపత్రి, 14 ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు),14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించనున్నారు. వాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపక నాయకుల స్మృతి మందిర్ లో ఉన్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్ నివాళులర్పించనున్నారు. 1956లో వేలాది మంది అనుచరులతో కలిసి అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షభూమిలోనూ నివాళులు అర్పించనున్నారు.

ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవం

ఆ తర్వాత సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ని సందర్శించి.. అక్కడ కొత్తగా నిర్మించిన మానవరహిత వైమానిక వాహనాల కోసం రూపొందించిన ఎయిర్ స్ట్రిప్ ను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ నుంచి ప్రధాని ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు వెళ్లనున్నారు. అక్కడ విద్యుత్, చమురు, గ్యాస్, రైలు, రోడ్డు, విద్య, గృహనిర్మాణ రంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇకపోతే, ప్రదాని పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా సిబ్బంది మోహరించారు. మొత్తం 900 మంది ట్రాఫిక్ పోలీసులు రోడ్లను పర్యవేక్షిస్తారని అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed