- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాంకర్ రష్మీ ని వాడుకొని వదిలేసిన టాలీవుడ్ హీరో ?

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ యాంకర్, నటి రష్మి ( Rashmi) గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు ఓ బంగారం లాంటి సినిమా ఆఫర్.. చివరి క్షణంలో దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో కాదు జయం. టాలీవుడ్ హీరో నితిన్ అలాగే హీరోయిన్ సదా ఇద్దరు కలిసి నటించిన సినిమా జయం. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా... అప్పట్లో రికార్డులు సృష్టించింది. 2002 జూన్ 14వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... ప్రేమకథాంశం నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించాడు.
రాను రానంటూనే చిన్నదో అంటూ ఇప్పటికీ ఈ సినిమాలోని పాట జనాల నోటి నుంచి వస్తూనే ఉంటుంది. అలాంటి బంపర్ ఆఫర్ సినిమాను మిస్ చేసుకుంది నటి రష్మి. ఈ విషయాన్ని తాజాగా హీరో నితిన్ ( Nithin) వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్... జయం సినిమా ( Jayam Movie) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో మొదటగా నటి రష్మిని హీరోయిన్ గా అనుకున్నారని వివరించాడు. నటి రష్మితో కలిసి రిహార్సల్స్ కూడా చేసినట్లు వివరించాడు నితిన్. కానీ చివరి క్షణంలో నటి రష్మిని తొలగించి సదాను (sadaa ) తీసుకువచ్చారని క్లారిటీ ఇచ్చాడు. ఈ తరుణంలోనే యాంకర్, నటి రష్మి బంపర్ ఆఫర్ కోల్పోయిందని.. నితిన్ చెప్పకనే చెప్పాడు. కాగా టాలీవుడ్ యంగ్ యాంకర్, నటి రష్మి ( Rashmi) ఇప్పటికే చాలా సినిమాల్లో చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు.