ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్..కేవలం 2 రోజులు ఆగండి !

by Veldandi saikiran |
ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్..కేవలం 2 రోజులు ఆగండి !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు ( Mumabi indians) అదిరిపోయే శుభవార్త అందింది. ముంబై ఇండియన్స్ జట్టులోకి... రెండు రోజుల్లోనే రేసు గుర్రం రాబోతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లోనే... ముంబై ఇండియన్స్ క్యాంప్ లో జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ముంబై ఇండియన్స్ ( Mumabi indians) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) జట్ల మధ్య ఏప్రిల్ 13వ తేదీన మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టులోకి కూడా..జస్ప్రీత్ బుమ్రా రాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే... గాయం నుంచి జస్ప్రీత్ బుమ్రా కోరుకున్నాడని కూడా చెబుతున్నారు. కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే.. జట్టులో కూడా చేరిపోతాడని చెబుతున్నారు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా.. రంగంలోకి దిగితే... ముంబై ఇండియన్స్ జట్టుకు సగం కష్టాలు పోతాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు.. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) మూల స్తంభంలా ఉంటాడు. గాయం కారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లకు జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో... ముంబై ఇండియన్స్ జట్టు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అయితే జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇస్తే, ముంబై కి 1000 ఏనుగుల బలం వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Next Story

Most Viewed