- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంత్రి సీతక్క సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రముఖ కార్పొరేట్ సంస్థ

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) సొంత గ్రామాన్ని (Own Village) ఓ ప్రముఖ సంస్థ దత్తత (Adopted) తీసుకుంది. దత్తత కార్యక్రమాన్ని స్వయంగా మంత్రి సీతక్క ప్రారంభించారు. ములుగు జిల్లాలో సీతక్క సొంత గ్రామమైన జగన్నపేట (Jaggannapeta)ను ప్రముఖ సంస్థ ఓపెన్ టెక్ట్స్ (Open Text) అనే ప్రముఖ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ గ్రామంలో విద్య, ఉపాధికి లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ గ్రామ దత్తత కార్యక్రమానికి హాజరైన సీతక్క సంస్థ ఆద్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా గ్రామా దత్తత కార్యక్రమంలో భాగంగా జగన్నపేట, ఇంచెంచెరుపల్లె గ్రామాలను ఓపెంటెక్స్ట్ కార్పొరేట్ సంస్థ నిర్మాణ్ ఎన్జీఓ సారథ్యంలో దత్తత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంస్థ దత్తత తీసుకున్న గ్రామాల్లో విద్య, ఉపాధిని లక్ష్యంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇలాగే స్వచ్చంద, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి, గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో గ్రామాల దత్తత (Village Adoption) అనేది వినూత్న మార్గమని అన్నారు. దీంతో గ్రామీణ అభివృద్ధికి ఓ కీలక ముందడుగు పడుతుందని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.