Viral Video: వావ్..వాట్ ఏ సీన్.. సమస్త తెలంగాణ కోరుకునేది ఇదే!

by Vennela |
Viral Video: వావ్..వాట్ ఏ సీన్.. సమస్త తెలంగాణ కోరుకునేది ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ముందుండి నడిపించే వాడిని నాయకుడు అంటారు. ఏకపక్షంగా వ్యవహరించేవాడిని నియంత అంటారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి నియంతలా కాకుండా నాయకుడిగా మెదగాలి. కానీ పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పై ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ నియంతలా మారి పాలించిండని దుమ్మేత్తిపోశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అంతేకాదు పదేండ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్.. మంత్రులను ఏనాడు తన దగ్గరకు రానివ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రులను అభిప్రాయాలను పట్టించుకునేవారు కాదని..వారి ఓ చీడపురుగులా చూసే వారని పలువురు మంత్రులు చర్చించుకునేవారు. అధికారం పోయిన తర్వాత కేసీఆర్ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం చకచక జరిగిపోయాయి. అయితే రేవంత్ రెడ్డి పాలనలో మంత్రులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి వలే కాకుండా స్నేహితుడి మాదిరిగా మంత్రులతో కలుపుగొలుపుగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఫ్రెండ్లీ క్యాబినెట్ అనే తరహాలో కొలీగ్స్ మూమెంట్స్ ఉంటున్నాయి. మా పింక్ పాలనలో మచ్చుకకు కూడా ఇలాంటివి కనిపియ్యలే అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. నోరు తెరిస్తే పెద్ద దొర గడీల రాగాలు, చిన్న దొర భజన తప్ప మరోటి లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రిని అనే అహంకారం ఇసుమంతైనా ఉండదా అన్నా నీకు. అంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి తాజా వీడియో వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొంగులేటి, జూపల్లి కలిసి ఒకేచోట సరదాగా ముచ్చట్లు పెట్టారు. ఒకరిమీద ఒకరు జోకులేసుకుంటూ పడి పడి నవ్వుకుంటూ కనిపించారు. సీఎం , మంత్రులు సరదాగా ఉండే ఎపిసోడ్ ను మంత్రి సీతక్క తన కెమెరాలో బంధించారు. ఈ వీడియోను రేవంతన్న సైన్యంతో పేరుతో వీడియోను షేర్ చేస్తూ స్వేచ్ఛగా మెలిగిన క్షణాలు మా పెంకి పాలనలో కరువయ్యాయి అంటూ క్యాప్షన్ ఇచ్చారు



Next Story

Most Viewed