- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Server Issue: రేషన్ దుకాణాల్లో సర్వర్ పరేషాన్! నగరంలో అరగంటకుపైగా మొరాయింపు..

దిశ, డైనమిక్ బ్యూరో: (Ration Shops) రేషన్ దుకాణాల్లో శనివారం (Server issue) సర్వర్ సమస్యతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. సర్వర్ పనిచేయకపోవటంతో పలు ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హైటెక్ నగరమైన (Hyderabad) హైదరాబాద్‌లో అరగంట నుంచి సర్వర్ మొరాయించడంతో బియ్యం పంపిణీ నిలిచిపోయింది. దీంతో రేషన్ కార్డుదారులు చౌక ధరల దుకాణాల వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విషయం తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులు సర్వర్ సమస్యకు చెక్ పెట్టారు. రేషన్ దుకాణాల్లో సాంకేతిక సమస్యను సవరించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేషన్ దుకాణాల్లో తెలంగాణ వ్యాప్తంగా యథావిధిగా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు.
కాగా, ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సన్న బియ్యం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోంది. వచ్చే నెలలో నగరంలోనూ సన్న బియ్యం పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, సన్న బియ్యం పంపిణీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది.