- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాబోయే భర్తతో బ్యాచిలర్ పార్టీ చేసుకున్న హీరోయిన్.. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ నెటిజన్ల కామెంట్స్(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరోయిన్ అభినయ(ABHINAYA) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ పుట్టుకతోనే మూగ, చెవుడు అయినప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. తెలుగులో ‘నేనింతే’(Neninthe) సినిమాలో కీ రోల్ ప్లే చేసిన ఈ భామ ఆ తర్వాత ‘శంభో శివ శంభో’(Shambho Shiva Shambho), ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి చిత్రాల్లో సిస్టర్ క్యారెక్టర్‌లో అలరించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు సన్నీ వర్మ(Sunny Varma)తో గత నెల 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్‌లో ఆ జంట గుడిగంట కొడుతున్న ఫొటోను షేర్ చేసింది. ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో అభినయకు కాబోయే వారు ఎవరా అని అందరూ ఎంతో క్యూరియాసిటీగా చూస్తున్న టైంలో ఆమెకు కాబోయే భర్త ఫొటో రివీల్ చేసింది. ఇక అప్పటి నుంచి సన్నీ వర్మ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేసేసి అతని గురించి తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అభినయ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో సన్నీ వర్మతో చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలతో పాటు ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ చేసుకున్న పిక్స్ షేర్ చేసింది. అలాగే డ్యాన్స్ చేస్తున్న ఫొటోలను కూడా పంచుకుంది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలుపుతున్నారు.