ఆ బస్ ఎక్కాలంటే భయంతో వణికిపోతున్న జనం.. కండక్టర్‌ గేర్ మారుస్తుండగా..

by Gantepaka Srikanth |
ఆ బస్ ఎక్కాలంటే భయంతో వణికిపోతున్న జనం.. కండక్టర్‌ గేర్ మారుస్తుండగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ(RTC)లో ప్రయాణం సురక్షితం.. సుఖమయం అని ప్రభుత్వాలు తరచూ చెబుతుంటాయి. ఈ తరహా రైటింగ్స్ బస్సుల్లోనూ దర్శనమిస్తుంటాయి. నిజానికి బైకుపై ఇద్దరు ముగ్గురు జర్నీ చేయడం, కార్లలో అతివేగంగా ప్రయాణించడం కంటే ఆర్టీసీల్లోనే సురక్షితం. కానీ.. ప్రభుత్వాలు ఆర్టీసీపై చూపిస్తున్న శ్రద్ధ అందరి అభిప్రాయాలు తప్పని ప్రూవ్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎవరి ఆలోచన అయినా తప్పకుండా మరుతుందనడంలో సందేహం లేదు. తమిళనాడు(Tamil Nadu)లో విహరిస్తున్న ఈ బస్సును ఇద్దరు డ్రైవ్ చేస్తున్నారు. ఒకరు డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తుండగా.. మరొకరు గేర్ బాక్స్ పక్కన కూర్చొని.. డ్రైవర్ చెప్పినప్పుడల్లా గేర్లు మారుస్తున్నాడు.

గేర్ రాడ్(Gear Box) లేకపోవడంతో రోడ్, స్పీడ్‌ను బట్టి కండక్టర్‌(Conductor) గేర్ మారుస్తున్నట్లు కనిపిస్తున్నది. దీనిని అదే బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఆర్టీసీపై ప్రభుత్వాలు చూపిస్తున్న శ్రద్ధపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రజల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యమా? ఓట్లు వేయించుకునేటప్పుడు తప్పా.. మిగతా సమయాల్లో ప్రజల పరిస్థితిని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు. ఏదైనా జరుగరానిది జరిగినప్పుడు వచ్చి హడావిడి చేయడం, సంతాపాలు తెలపడం కాదని.. ముందుగానే సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.




Next Story

Most Viewed