- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కీలక పరిణామం.. వైసీపీ ఎంపీని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్లిన సీఐడీ

దిశ, వెబ్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ (YCP Govt) హయాంలో మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకలు (Irregularities in alcohol sales and manufacturing) జరిగాయని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Rajampet MP Peddireddy Mithun Reddy) ప్రమేయం ఉందని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ఆరోపించిన సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని డిస్టిలరీలు నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేసి, ప్రభుత్వ ఛానెళ్ల ద్వారా అధిక ధరలకు విక్రయించాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, మద్యం కోటాలను కొన్ని డిస్టిలరీలకు పెంచడంలో, మరికొన్నింటిని తగ్గించడంలో ఆయన ప్రభావం చూపినట్లు సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు (Investigation by CID officers) చేస్తుండగా.. ఆయన గత నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court)లో ముందస్తు బెయిల్ (Anticipatory bail) కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున వాదిస్తూ, తాను ఎంపీగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది జరిగిన మరుసటి రోజు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం (tage is set for arrest) అయింది. మిథున్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.