వైసీపీకి బిగ్ షాక్.. 200 మంది కార్యకర్తలు జంప్

by srinivas |   ( Updated:2025-04-10 17:26:35.0  )
వైసీపీకి బిగ్ షాక్.. 200 మంది కార్యకర్తలు జంప్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నేతలే కాదు.. కార్యకర్తలూ చేయి జారీ పోతున్నారు. రాష్ట్రంలో కూటమి(Alliance) అధికారంలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగువ స్థాయి కార్యకర్తలు డీలాపడిపోయారు. అడపాదడపా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కూడా కొందరు మాత్రమే పాల్గొంటున్నారు. నేతలు పిలిచినా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఛాన్స్ దొరికితే ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో వైసీపీ(Ycp) కింది స్థాయి కార్యకర్తలందరూ టీడీపీ(Tdp), జనసేన(Janasena) పార్టీల్లో చేరిపోతున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లా(Nellore District)లో అక్కచెరువుపాడు(Akkacheruvupadu)కు చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(MLA Kotamreddy Sridhar Reddy) సమక్షంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశంతో కలిసి తామూ నడస్తామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed