- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డి ప్రవాస భారతీయుల దినోత్సవ సందేశం
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ పాత్ర ముఖ్యమైనదని, తెలంగాణ రైజింగ్ కార్యాచరణలోనూ ఎన్నారైల భాగస్వామ్యం ఆవశ్యకమని ఈ మేరకు గురువారం సీఎం ఒక ప్రకటన సందేశంలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా గొప్ప పేరు పొందిన తర్వాత స్వజనుల సేవ కోసం, స్వరాజ్య సాధనలో భాగం కావడానికి 1915 జనవరి 9 న ముంబైకి తిరిగి వచ్చిన సందర్భానికి గుర్తుగా ఈ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని సీఎం రేవంత్గుర్తుచేశారు. ప్రవాసుల పెట్టుబడులు, ఆలోచనలకు తెలంగాణ చక్కటి వేదికగా ఉండటమే కాదు, ప్రవాసీ ప్రజావాణి లాంటి వినూత్న కార్యక్రమాలతో గల్ఫ్, ఇతర దేశాల్లోని కార్మికుల సంక్షేమానికి కూడా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.
- Tags
- CM Revanth Reddy