నాదర్ గుల్ లో అక్రమ షెడ్ ను కూల్చివేత

by Kalyani |
నాదర్ గుల్ లో అక్రమ షెడ్ ను కూల్చివేత
X

దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్ గుల్ లో అక్రమంగా నిర్మిస్తున్న రేకుల షెడ్ ను బడంగ్ పేట్ మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో గురువారం కూల్చివేశారు. నాదర్ గుల్ పరిధిలోని సర్వే నెంబర్ 180/ఏ లో 1100 చదరపు గజాలలో ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల షెడ్ ను నిర్మిస్తున్నట్లు బడంగ్ పేట్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. గురువారం బడంగ్ పేట్ కమిషనర్ సరస్వతి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చి వేశారు. నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన, ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బడంగ్ పేట్ కమిషనర్ సరస్వతి హెచ్చరించారు. బడంగ్ పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరూ మున్సిపల్ అనుమతి తీసుకొని ప్లాను ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Next Story