- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకే ఉంది
దిశ, కీసర : ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటేనని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని సెయింట్ మేరీస్ బేతనీ హైస్కూల్ లో 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరిని తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఒక్కటేనని, అదంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. విద్య అనేది శాంతి, న్యాయం, స్వేచ్ఛ, అందరికీ సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని సాధించే సాధనమని, అలాంటి విద్యను అందించే గురువులందరూ పూజ్యునీయులని అన్నారు. చదువు లేకుండా మంచి జీవితం సాధ్యం కాదని, విద్యార్థులు ఉండే తరగతి గది అంటే నాలుగు గోడలు కాదని నాలుగు దిక్కులని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగ హరిబాబు, నాగారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెళ్ల శ్రీధర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.