గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు రిమాండ్​

by Sridhar Babu |
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు రిమాండ్​
X

దిశ, కూసుమంచి : గంజాయి వ్యాపారం చేస్తూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు కూసుమంచి ఎస్ఐ నాగరాజు తెలిపారు. గురువారం కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయకన్ గూడెం అండర్ పాస్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వస్తూ పోలీసులని చూసి ఒక వ్యక్తి పారిపోయాడు. దాంతో నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులైన కందుల అనిల్ కుమార్ ,షేక్ ఈసుబులను పట్టుకొని విచారించారు.

వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయిని, ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో పై ఇద్దరు, మరో ఇద్దరు వ్యక్తులైన సూర్యాపేట జిల్లా,మోతే మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన చిలకబత్తిని వెంకటేష్, మండవ సాయితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు చెప్పారు. దాంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. అన్నారుగూడెం గ్రామానికి చెందిన చిలక బత్తిని వెంకటేష్, మండవ సాయి అనే నిందితులు పరారీలో ఉన్నట్లు కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు.

Advertisement

Next Story