- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థుల నుంచి ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఎన్ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుండి 10వ తరగతి మధ్యగల విద్యార్థులు ఈ నెల 6వ తేదీ నుండి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. http//telanganaams.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 125 రూపాయలు, ఇతర విద్యార్థులకు 200 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 3 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 6వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 13న ఉదయం 10 నుండి 12 గంటల వరకు మరియు అదే రోజు మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు 7వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.