- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
![ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్](https://www.dishadaily.com/h-upload/2025/01/09/409246-13.webp)
దిశ, నారాయణపేట ప్రతినిధి :నారాయణపేట మండలంలోని అప్పిరెడ్డిపల్లి శివారులోని సర్వే నంబర్ 17 లోని ప్రభుత్వ భూమిని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆ సర్వే నెంబర్ లో మొత్తం ఎంత భూమి ఉందని ఆర్డిఓ రాంచందర్ నాయక్ ను అడిగారు. గుట్ట ప్రాంతమైన 17 సర్వే నంబర్ లో మొత్తం 57.28 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని ఆర్డీవో తెలపగా.. వాటిలో సోలార్ పవర్ ప్లాంట్ కు అనువైన దక్షిణ భాగ 10 ఎకరాల భూమిని గుర్తించి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాలలో అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఈ నెల 8 న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించిన విషయం విధితమే. అందులో భాగంగానే గురువారం జిల్లా కలెక్టర్ మండలంలోని అప్పిరెడ్డిపల్లి శివారులో గల 17 సర్వేనెంబర్ లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. జిల్లా మొత్తంగా అన్ని మండలాల్లో దాదాపు 196 ఎకరాల ప్రభుత్వ స్థలాలలో మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వాన్ని నిబంధనల మేరకు కలెక్టర్ గురువారం అప్పిరెడ్డిపల్లి శివారులోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్డిఓ రామచందర్ నాయక్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మండలంలోని బైరoకొండ, అమ్మిరెడ్డిపల్లి లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.