Stampede Incident:ముక్కోటి ఏకాదశి దర్శనాలపై గరికపాటి వ్యాఖ్యలు వైరల్(వీడియో)

by Jakkula Mamatha |   ( Updated:2025-01-09 15:57:43.0  )
Stampede Incident:ముక్కోటి ఏకాదశి దర్శనాలపై గరికపాటి వ్యాఖ్యలు వైరల్(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొక్కిసలాట నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి దర్శనాలపై గతంలో గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ వైరలవుతున్నాయి. గరికపాటి ప్రవచనం చెబుతూ.. భగవంతుడి దర్శనానికి ముహుర్తాలు, పుణ్య తిధులు లేవని, అదే రోజే, అదే ముహూర్తానికే వెళ్లాలని ఏమీ లేదని చెప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ముక్కోటి ఏకాదశికి భక్తులంతా తిరుపతిలోనే ఉంటారని, ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తుతారని గుర్తుచేశారు. అదే రోజు, అదే ముహూర్తంలో దర్శనం చేసుకోవాలని ఎగబడితే ప్రమాదాలే జరుగుతాయని గరికపాటి పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశికి ఆలయాలకు అదే రోజు వెళ్లాలని సరికాదని, ఆ మరుసటి రోజు లేదా రెండు మూడు రోజులు ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి దోషం లేదని ఆయన చెప్పారు. ఆలస్యంగా వచ్చావని దేవుడు ఏమీ కొట్టాడు అన్నారు. ‘శరీరాన్ని మించిన క్షేత్రం, మనస్సును మించిన తీర్థం లేవు.. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఓ పుణ్య తీర్థం’ అని గరికపాటి పేర్కొన్నారు. ప్రస్తుతం గరికపాటి పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

( Video Credit's to NLK LEO YouTube Channel )

Advertisement

Next Story