- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుమల తొక్కిసలాట మృతుల వివరాలను వెల్లడించిన అధికారులు
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం తొక్కిసలాట(Stampede) జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి(Six people died) చెందగా.. మరో 40 మందికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రి(Ruya Hospital)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే స్వల్ప గాయాలతో బయటపడినవారు ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నారు. అయితే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాల(Deceased Details)ను టీటీడీ అధికారులు వెళ్లడించారు. మొత్తం మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు తెలిపారు. అలాగే మృతులు బుద్దేటి నాయుడబాబు(51) నర్సీపట్నానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. విశాఖకు చెందిన రజిని(47) లావణ్య(40), శాంతి(34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడు రాష్ట్రంలోని సేలంకు చెందిన మల్లిగ(49) గా మృతులను గుర్తించారు.