చట్టాలపై అవగాహన ఉండాలి

by Naveena |
చట్టాలపై అవగాహన ఉండాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: చట్టాలపై అవగాహన పెంచుకొని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ,రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన'మనోన్యాయ్' కమిటీ సభ్యులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ గురువారంతో ముగిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లల చట్టాలు,బాల కార్మిక వ్యవస్థ,బాల్యవివాహాల నిర్మూలనలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శిశు గృహను సందర్శించారు. ఈ కార్యక్రమంలో 'మనోన్యాయ్' కమిటీ సభ్యులు ప్యానెల్ లాయర్లు,పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story