- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టవర్ ఎక్కి యువకుడు హల్ చల్
దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ మండలం బీర్సాయిపేట్ కి చెందిన భార్య భర్తలు గొడవపడి క్షణికవేశంతో భర్త టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఉట్నూర్ ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం బీర్సాయిపేట్ కి చెందిన మంగం తిరుపతి భార్య జ్యోతి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. బుధవారం రాత్రి తిరుపతి మద్యం సేవించడంతో ఇంట్లో భార్య, భర్తకు గొడవ జరిగింది.
గురువారం బిర్సాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపాన ఉన్న టవర్ ఎక్కి రెండు గంటలపాటు కిందికి దిగకుండా హల్ చల్ చేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నచ్చ చెప్పి కిందికి దింపి ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో భార్య భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి మద్యం తాగొద్దని, కలిసి మెలిసి ఉండాలని సూచించారు. ఇక ముందు ఇలాంటి ఘటన చేసుకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి ఇంటికి పంపించారు.