- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
16 Rupees Smartphone: 16 రూపాయలకే స్మార్ట్ వాచ్ ఫోన్.. డోంట్ మిస్ ది ఆఫర్

దిశ వెబ్ డెస్క్: Lava Smartphone and Smartwatch Sale: ప్రముఖ మొబైల్ తయారుదారీ సంస్థ అయిన లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన 16వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 30, 2025న స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే లభ్యమయ్యే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్స్ వంటి అనేక గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో ప్రత్యేక ఆకర్షణా మొదటి వంద మంది కొనుగోలుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీరు మొదటి 100 మంది కొనుగోలుదారులలో చేరితే, మీరు రూ.16కి స్మార్ట్‌ఫోన్‌ను, రూ.16కి స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే లావా అగ్నీ 3 స్మార్ట్ ఫోన్ లావా ప్రోవాచ్ V1 ఫ్లాష్ సేల్ సాయంత్రం 7గంటలకు తీసుకురానున్నారు. ఈ స్పెషల్ డీల్ ను పొందాలంటే అగ్ని 4 కొనేందుకు అగ్ని3 అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి. అలాగే ప్రోవాచ్ వి1 కొనేందుకు ప్రోవాచ్ అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి.
అంతేకాదు వీటితో లావా 16వ వార్షికోత్సవ సేల్ లో 2025లతో భాగంగా స్మార్ట్ డీల్స్ లో లావా AGNI 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.19,999కి లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉన్నాయి. ప్రధాన స్క్రీన్ 6.78 అంగుళాలు, క్వర్డ్ స్క్రీన్ ఉంటుంది. సెకండరీ డిస్ప్లే ఫోన్ వెనుక భాగంలో కెమెరాల దగ్గర ఉంటుంది. నోటిఫికేషన్లు, ఇతర పనుల కోసం ఉపయోగించవచ్చు. లావా అగ్ని 3 మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. లావా అగ్ని 3 5000mAh Li-Po బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 66W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అయితే మీరు బాక్సులో ఛార్జర్ కావాలనుకుంటే ఆ మోడల్ ధర ఎక్కువగా ఉంటుంది. 16 రూపాయలకు లభించే లావా అగ్ని 3 బాక్స్‌లో ఛార్జర్ ఉంటుందా లేదా అనేది కంపెనీ చెప్పలేదు.
లావా ప్రోవాచ్ V1 ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ.2,399. కంపెనీ దీన్ని కూడా రూ.16కి అమ్మబోతోంది. ProWatch V1 390x450 పిక్సెల్‌ల అధిక రిజల్యూషన్‌తో 1.85-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది రియల్‌టెక్ 8773 చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లో GPS సపోర్టు కూడా ఉంది. లొకేషన్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందించింది. వాకింగ్, యోగా వంటి అనేక ఫిట్‌నెస్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి IP68 రేటింగ్ ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ లావా వార్షికోత్సవం సేల్ లావా అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో కేవలం మార్చి 30, 2025 మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Read More..
Vivo V50e: వెడ్డింగ్ పోర్ట్రైట్ స్టూడియో ఫీచర్.. ఈ మొబైల్ అదుర్స్ కదూ