అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా

by Ajay kumar |
అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
X

- మేలో ఐఎస్ఎస్‌కు వెళ్లే అవకాశం

- ఆక్సియం మిషన్-4లో ప్రయాణం

- వెల్లడించిన నాసా

దిశ, నేషనల్ బ్యూరో: భారత వ్యోమగామి (డిసిగ్నేటెడ్) శుభాన్షు శుక్లా ఈ ఏడాది మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే అవకాశం ఉన్నట్లు నాసా తెలిపింది. జెఫ్ బెజోస్‌కు చెందిన ఆక్సియం మిషన్-4 ద్వారా ఆయన అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళంలో అధికారిగా పని చేస్తున్న శుభాన్షు శుక్లా.. 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా చరిత్రకెక్కనున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారతీయుడు తిరిగి అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. ఆయనతో పాటు నాసా మాజీ వ్యోమగామి, మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ, హంగేరికి చెందిన టిబోర్ కాపు కూడా ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించబోయే గగన్‌యాన్ మిషన్‌కు శుభాన్షును కీలకమైన వ్యోమగామిగా గుర్తించిన అనంతరం అతడిని ఆక్సియం-4కు ఎంపిక చేశారు.

కాగా, ఇస్రో నిర్వహించే గగన్‌యాన్ మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి పంపనున్నారు. ఈ మిషన్ కోసం నాసా, ఆక్సియమ్‌లతో కలిసి ఇస్రో పని చేస్తుంది. ఇండియా నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్‌ నాయర్‌ను డిసిగ్నేటెడ్ ఆస్ట్రనాట్‌గా ఎంపిక చేశారు. ఏవైనా కారణాలతో శుభాన్షు శుక్లా వెళ్లలోకపోతే నాయర్ ఆక్సియమ్-4లో ప్రయాణం చేస్తారు. నాసా, ఇస్రో మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా హూస్టన్‌కు చెందిన ఆక్సియం స్పేస్ ఇన్‌కార్పొరేషన్ రాబోయే అంతరిక్ష యాత్రలోఒక వ్యోమగామి కోసం సీటును కొనుగోలు చేశారు. అయితే అంతరిక్ష సంస్థల మధ్య సహకారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల నుంచి మినహాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed