- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రవాదులను బంకర్లలో దాచిపెడుతున్న పాక్..కీలక విషయాలు వెల్లడించిన ఇంటిలిజెన్స్

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ భయపడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఆ దేశ రక్షణశాఖ మంత్రి భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చు అని సంకేతాలు ఇస్తుంటే మరోవైపు అక్కడి ఆర్మీ ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ షెల్టర్లలో ఉగ్రవాదులకు రక్షణ కల్పించడంతో పాటూ బంకర్లలో దాస్తోందని నిఘా వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. మరోవైపు పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను సైతం ఖాళీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు వారు లాంచ్ ప్యాడ్‌లలోనే నివసిస్తుంటారు. వీటిలో 200 నుండి 300 వరకు ఉగ్రవాదులు ఉన్నారని భారత్ గుర్తించింది. ఈ నేపథ్యంలో వారికి ప్రమాదం పొంచి ఉందని వారిని పాక్ ఆర్మీ తరలించినట్టు సమాచారం. ఇప్పటికే బార్డర్ వద్ద ఇండియన్ ఆర్మీ విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని ఉగ్రవాదుల నివాసాలను ఆర్మీ కూల్చివేసింది. కనిపించిన ఉగ్రవాదులను పిట్టల్లా కాల్చిపడేస్తుంది. కశ్మీర్‌లోని అన్ని ప్రాంతాలను ఆర్మీ జల్లెడ పడుతోంది. పహల్గామ్ ఘటనకు పాల్పడిన తీవ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఏ క్షణమైనా వారిని మట్టుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సైతం భారత్ ను చూసి వణుకుతున్నట్టు కనిపిస్తోంది.