- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నలిగిపోతున్న నాలుగో సింహం…పోలీసింగ్‌పై పొలిటికల్ ప్రెజర్
దిశ,జగిత్యాల ప్రతినిధి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాఠీ పట్టి లా అండ్ ఆర్డర్‌ను సరిచేస్తున్న పోలీసులనూ పలు సమస్యలు చుట్టేస్తున్నాయి. మల్టీపర్పస్ డ్యూటీలతో సిబ్బంది నలిగిపోతున్నారు. పోలీసు అధికారులకు పోస్టింగ్ కావాలంటే పైరవీలు, సిఫారసు లేఖలు ఒకప్పటి మాట. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక డ్యూటీలో సిన్సియారిటీ పని తీరు ప్రామాణికంగా పోస్టింగులు ఇస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పోస్టింగ్ లలో రాజకీయ జోక్యం చాలా వరకు తగ్గింది. దీంతో చాలా చోట్ల పోలీస్ ఆఫీసర్లు స్వేచ్ఛగా పని చేస్తున్నారు.
అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పోస్టింగుల విషయం అటుంచితే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలలో పనిచేస్తున్న అధికారులపై కొంతమేర పొలిటికల్ ప్రెజర్ ఉన్నట్టు డిపార్ట్మెంట్ వర్గాలే చర్చించుకుంటున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి వడకత్తెర లో పోక చెక్కలా మారింది. కొన్ని సందర్భాల్లో నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా నాలుగో సింహాం నలిగిపోతుంది. కొందరు పోలీసు ఆఫీసర్లు అయితే జిల్లా నుండి మరో చోటుకి ఎప్పుడు బదిలీ అవుతామో అని ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ రెండు చోట్ల వింత పరిస్థితి..!
జగిత్యాల నియోజకవర్గం లో అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య ఉన్న గ్యాప్ ఆఫీసర్ల పైన ప్రభావం చూపిస్తుంది. సిన్సియర్ గా పనిచేస్తున్న ఆఫీసర్లకు నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఆఫీసర్లు సతమతమవుతున్నారు. ఎవరి మాట వింటే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లుగా తెలుస్తుంది. సర్వీస్ లో ఎలాంటి రిమార్కు లేని ఆఫీసర్లు ఈ నాయకుల కారణంగా ఎక్కడ విభేదాల్లో ఇరుక్కుంటామో అని బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కోరుట్లలో బిఆర్ఎస్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండగా కాంగ్రెస్ గత ఎన్నికల్లో పట్టు సాధించలేకపోయింది. అయినప్పటికీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం తో స్థానికంగా కాంగ్రెస్ నాయకుల హవా నడుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలకు చెందిన లీడర్ల నుండి చిన్న చిన్న విషయాలకు సైతం ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకొస్తూ ఇబ్బంది పెడుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది.
లీకు వీరులతో కొత్త చిక్కులు..
గత ప్రభుత్వ హయాంలో కొందరు ఆఫీసర్లకు అన్నీ తామై వ్యవహరించిన కొందరు కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తన ఆఫీసర్లకు చిక్కులు తెచ్చే విధంగా ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది డైనమిక్ ఆఫీసర్ల పోలిసింగ్ కారణంగా కిందిస్థాయి సిబ్బంది పాచికలు పారడం లేదు. దీంతో ఏకంగా ఆఫీసర్ల పై అలిగేషన్స్ తీసుకొచ్చి సాగనంపాలని చూస్తున్నారు. డ్యూటీ లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఆఫీసర్లపై ఆయా పార్టీలకు చెందిన నాయకులకు డిపార్ట్మెంట్ పరంగా గోప్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను లీకులు ఇస్తూ ఇబ్బందులు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. ఆఫీసర్లను కలవడానికి వచ్చిపోయే నాయకుల వివరాలను ప్రత్యర్థి పార్టీల వారికి చేరవేస్తున్నట్లు సమాచారం. గతంలో కొందరు ఆఫీసర్లకు అనునయలుగా వ్యవహరించిన కిందిస్థాయి సిబ్బంది ఏళ్లుగా స్థానికంగా ఉండే పీఎస్ లకు మారుతున్నారే తప్ప మరో చోటికి బదిలీ అవ్వడం లేదంటే పొలిటికల్ లీడర్ల సాయంతో డిపార్ట్మెంట్ లో ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
మున్సిపాలిటీల్లోనూ అదే తంతు..
జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలలో కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కాకుండా మున్సిపాలిటీలు,రెవెన్యూ ఆఫీసుల్లో పొలిటికల్ ప్రెజర్ ఉన్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓ పని చేయమని ఓకే పార్టీలో ఉన్న లీడర్ చెబితే.. చేయవద్దని అదే పార్టీకి చెందిన మరో లీడర్ చెప్పడం తో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడం అధికారుల వంతు అవుతుంది. ఇలాంటి భిన్న పరిస్థితుల నేపథ్యంలో మరోచోట పోస్టింగ్ వచ్చినా బాగుండని ఆయా శాఖల అధికారులు సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లుగా తెలుస్తుంది. పోస్టింగులకు పైరవీలు, సిఫార్సు లేఖలు లేకపోయినా నాయకులు తీరు స్వేచ్ఛగా పని చేసుకునేలా లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.