CM Revanth Reddy : ఈనెల 14న ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2025-01-09 15:40:07.0  )
CM Revanth Reddy : ఈనెల 14న ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ(Delhi)కి పయనం కానున్నారు. ఈనెల 15న ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసు(AICC Office) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆరోజు సాయంత్రం, 16న పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విన్నవించనున్నారు. 17న ఢిల్లీ నుంచి సింగపూర్(Singapoor) వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ రెండు రోజుల పర్యటన కొనసాగించనున్నారు. అనంతరం 19వ తేదీన సింగపూర్ నుంచి దావోస్(Davos) వెళ్లనున్నారు. దావోస్ లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.

Next Story