- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP HC: ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court)లో రాజంపేట ఎంపీ మిథన్‌రెడ్డి(MP Mithun Reddy)కి ఊరట లభించింది. లిక్కర్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ధర్మాసనం వచ్చే నెల 3 వరకు ఎంపీ మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీ(CID)కి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
కాగా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గత సెప్టెంబర్‌లో సీఐడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టును మిథున్ రెడ్డి కోరారు. అయితే ముందస్తు బయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కనీసం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఈ మేరకు తాజాగా మిథున్ రెడ్డికి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.