TG Gurukul CET-2025:విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల

by Jakkula Mamatha |
TG Gurukul CET-2025:విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లోని విద్యార్థుల(Student)కు గుడ్ న్యూస్ వచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన TG CET ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని SC, ST, BCతో పాటు సాధారణ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు కల్పిస్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://tgswreis.telangana.gov.in/ ఫలితాలు చూడొచ్చు.

Next Story

Most Viewed