Viral video: చిరుతపులికి చెమటలు పట్టించిన వానర సైన్యం.. షాకింగ్ వీడియో వైరల్

by D.Reddy |   ( Updated:2025-04-14 12:26:31.0  )
Viral video: చిరుతపులికి చెమటలు పట్టించిన వానర సైన్యం.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఐకమత్యమే మహాబలం (Unity is strength) అని చెబుతుంటారు పెద్దలు. అంటే.. అంతా ఒకటిగా కలిసి ఉంటే ఎంతటి కష్టనైనా సులువుగా ఎదురుకోవచ్చని అర్థం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. తమపైకి దాడికి వచ్చిన చిరుతపులిని (Cheetah) కోతుల (Monkey) గుంపు ఏ విధంగా తరమికొట్టిందో ఈ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కోతుల ఐక్యతను తెగ మెచ్చుకుంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ఓ రోడ్డుపై బబూన్ కోతులు గుంపులుగా ఉన్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన చిరుతపులి ఓ కోతిపై దాడి చేయబోయింది. ఇంతలో ఆ కోతులన్నీ ఒక్కొక్కటిగా చిరుతపై దాడికి దిగాయి. చిరుతను ఊపిరాడకుండా చేస్తూ చుక్కలు చూపించాయి. దీంతో వాటి దాడి తట్టుకోలేకపోయిన చిరుతపులి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. ఇదంతా రోడ్డుపై ఆగిపోయిన వాహనదారులు వీడియోలో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed