- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
సంబరంగా అక్క ఇంటికి వెళ్లాడు.. విగతజీవిగా మిగిలాడు
by Sumithra |

X
దిశ, శివ్వంపేట : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపేట గ్రామరాయిని కుంటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన నీలం శేఖర్ (28) తన అక్క గ్రామమైన శివ్వంపేట మండలం కొత్తపేటకు వచ్చి తన బావ జగన్ తో కలిసి గ్రామంలో ఉన్న రాయినికుంటకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ఫిట్స్ రావడంతో వలకు చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. స్థానికులు వెంటనే అతని నర్సాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుని తండ్రి నీలం వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story