ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు : భార‌త్ స‌మ్మిట్‌లో విదేశీ ప్రతినిధులు

by M.Rajitha |
ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు : భార‌త్ స‌మ్మిట్‌లో విదేశీ ప్రతినిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దని కొందరు విదేశీ ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడి దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారని, ఇందుకు ఇండియన్​పీపుల్స్ కు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. వరల్డ్ వైడ్​గా ఉగ్రవాదాన్ని ఆరికట్టేందుకు అడుగులు వేయాలన్నారు. ఈ సమ్మిట్లో ఉగ్రవాదం రూపుమాపే దిశగా ఆలోచన చేసి, ప్రపంచానికి ఒక ఈ సమ్మిట్​ద్వారా మెసేజ్​ఇవ్వాలన్నారు. హైదరాబాద్ లోని హెచ్​ఐసీసీ శుక్రవారం ప్రారంభమైన భారత్​సమ్మిట్​కు విచ్చేసిన విదేశీ ప్రతినిధులు భారత్​సమ్మిట్​నిర్వాహకులు ఏర్పాటు చేసిన నులు రాట్నం, తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిబిషన్, భారత సమ్మిట్​లోగో ఫోటో సెషన్​ఇతరత్ర ప్యానల్​డిస్కషన్​హాళ్లను ప్రత్యేకించి సందర్శించారు.

కొందరు విదేశీ డేలిగెట్స్​నులు రాట్నం నుంచి నులు వలికేందుకు ప్రయత్నించారు. ఇండియా నులురాట్నానికి సంబంధించి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసి ఈ భారత్​సమ్మిట్ ను విదేశీ డెలిగేట్స్‌ గ్రేట్ స‌మ్మిట్‌గా అభివ‌ర్ణించారు. అలాగే, భారత సమ్మిట్​లోగో ఫోటో సెషన్ వద్ద విదేశీ డెలిగేట్స్ ఐక్యత, శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు​ప్రపంచ దేశాలు సంఘటితం కావాలని తమ ఫోటోలతో సంకేతాన్ని ఇచ్చారు.



Next Story

Most Viewed