- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ లో శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట అధికంగా వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అలాగే కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అందులో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు:
ఆదిలాబాద్ -44.6
భద్రాచలం -40.6
హకీంపేట్ -40.6
దుండిగల్ -40.1
హన్మకొండ -40.5
హైదరాబాద్ -39.1
ఖమ్మం -41.6
మహబూబ్నగర్ -41
మెదక్ -42.8
నల్గొండ -41
నిజామాబాద్ -45
రామగుండం -43.2