- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాలం తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే..: సూర్యాపేట ఎమ్మెల్యే

దిశ,చివ్వేంల : వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం తండాలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కాలం తెచ్చిన కరువు కాదని ముమ్మాటికీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనని, రైతుల ఉసురు తీస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. దోచుకోవడం,పంచుకోవడం, దాచుకోవడం ఈ మూడే కాంగ్రెస్ సిద్ధాంతాలని పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని మళ్ళీ కన్నీళ్ల పాలు చేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, పొట్టకొచ్చిన పంటలను నీళ్ళు లేక పశువులకు అమ్ముకునే పరిస్థితోచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో నిర్లక్ష్యంగా ఉందని తెలియజేశారు. కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోయాయని కాళేశ్వరం కాకుండా ఎస్సారెస్పీ నీళ్లే అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండుతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మళ్ళీ కాళేశ్వరం మాకు అప్పగిస్తే ఒక్క ఎకరం ఎండిపోకుండా చూస్తామని, రైతుల కన్నీళ్లు తుడుస్తామని తెలిపారు. ఎండిపోయిన పంట పొలాల గురించి రైతన్నల కష్టాల గురించి ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని దావత్ కు పోవడానికి హెలికాప్టర్ దొరుకుతున్నాయి. కానీ ఎండిన పొలాలు పరిశీలించడానికి సమయం దొరకకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందన్నారు. సన్న బియ్యం అందించడానికి కాకుండా ఎండిన పొలాలను, రైతన్నల కష్టాలను ఎక్కిరించడానికి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నట్టుందని, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చేసిన మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని తెలిపారు. వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతాంగానికి చిన్న ఇబ్బంది కలగకుండా కేసీఆర్ నాయకత్వంలో అండగా నిలిచి ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని,కేసీఆర్ రూ. 10, 000 ఇస్తే రూ. మేము 15, 000ఇస్తామని ఆశ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తెలిపారు. మంత్రులకు శాఖల గురించి అర్థం కాకపోతే కనీసం అధికారులను అడిగిన తెలుసుకుంటే మంచిదని హితువు పలికారు.
కేసీఆర్ ముందుచూపుతో,అద్భుత ప్రణాళికతో రాష్ట్రాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాడు. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర బానిసలుగా పాలన కొనసాగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక్క తడికైనా నీళ్లిస్తే కొంత మంది రైతన్నలు అప్పుల బారిన పడకుండా ఉంటారని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వారి వెంట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రౌతు నరసింహారావు, దారావత్ బాబు నాయక్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం మండల ఉపాధ్యక్షులు భూక్య నాగు నాయక్, అనంతుల మధు, భూక్య వెంకన్న, వీరభద్రయ్య, ఉప్పలయ్య, భీమ్లా, పల్లేటి నాగయ్య, అనిల్ నాయక్, హముడా, గుద్దేటి చిన వెంకన్న, నగేష్,అనిల్, దస్తగిరి,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.