- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విధుల పట్ల నిర్లక్ష్యానికి చర్యలు తప్పవు

దిశ, సంగారెడ్డి : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఓ డాక్టర్ ను విధుల నుంచి తొలగిస్తూ, మరో ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా వైద్యధికారిణి గాయత్రి దేవిని ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలో మాతా శిశు మరణాలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో డాక్టర్ అజ్మనాజ్ ను విధులను తొలగించాలని డీఎం అండ్ హెచ్ ఓ గాయత్రి దేవి కి ఆదేశించారు. దౌల్తాబాద్ ,మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో.. నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజు నోటీసులు అందజేయాలని ఆదేశించారు.
జిల్లాలో 2023 -24 సంవత్సరం పోల్చితే 2024-25 సంవత్సరంలో మాతా శిశు మరణాలు 50 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే లో రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హై రిస్కు కేసులో రెఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్లు సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి సూచనలు సలహాలు, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడడంతో పాటు మందులు వాడేలా పౌష్టికాహారం తీసుకునేలా చూస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి అన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రి దేవి, జిజిహెచ్ సూపర్డెంట్ అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.