- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Chandrababu: ప్రజలకు ఉగాది విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. కీలక సందేశం

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే లేచి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పెద్దఎత్తున తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం అవుతోన్న తరుణంలో రానున్న రోజుల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం వినేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి షడ్రురుచులు ఆస్వాదించేందుకు సన్నద్ధం అవుతోన్నారు.
.ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తాం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ.. సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.