‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుంచి సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-04-01 15:30:37.0  )
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుంచి సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్(Sunil), అర్జున్ దాస్(Arjun Das), రాహుల్ దేవ్(Rahul Dev) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన అజిత్ ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మరో అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా మూవీ నుంచి సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెడుతూ.. గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి గాడ్ బ్లెస్ యూ సాంగ్ ఈరోజు రాబోతుంది అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.

Next Story

Most Viewed