- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెదక్ లో చైనా మాంజా విక్రయం…ఇద్దరిపై కేసు నమోదు
దిశ, మెదక్ ప్రతినిధి : నిషేధిత చైనా మాంజ విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నాగరాజు వెల్లడించారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజను విక్రయించవద్దని ఆదేశించిన మెదక్ పట్టణంలో విక్రయిస్తున్న సమాచారం మేరకు పట్టణ సీఐ గురువారం దాడులు చేశారు. ఫతేనగర్ లో పతంగుల షాప్ లో హనుమంత్, అహమ్మద్ బేగ్ ల షాప్ లలో తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత చైనా మాంజ లభ్యమైంది. వారి వద్ద రూ. 3,584 విలువ గల 8 బండిల్స్ ను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ… ప్రభుత్వ నిషేధిత చైనా మాంజా కలిగి ఉన్న, ఇతరులకు అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నైలాన్ సింథటిక్ దారాలతో తయారు చేసే చైనా మాంజాలతో మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరమని అన్నారు. రోడ్డుపై మోటార్ సైకిల్ తో వెళ్లే వారికి కూడా మెడకు, కాల్కు చుట్టుకొని చనిపోయిన సంఘటనలు జరిగాయన్నారు. పర్యావరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చైనా మాంజా విక్రయాలు వినియోగం పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందన్నారు. ఎవరైనా చైనా మాంజను విక్రయిస్తున్న , కలిగి ఉన్న సమాచారాన్ని వెంటనే పట్టణ పోలీసులకు కానీ 100 కానీ సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సీఐ వెంట పట్టణ ఎస్ఐ అమర్, ఏఎస్ఐ రుక్సానా, సిబ్బంది ఉన్నారు.