Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. బండి సంజయ్, కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!

by Shiva |
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. బండి సంజయ్, కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) రాష్ట్రంలో చర్చనీయాశంగా మారింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారందరిని అధికారులు చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అందులో మరో నలుగురికి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తొక్కిసలాట (Tirumala Stampede) ఘటన‌పై కేంద్ర మంత్రులు బండి సంజయ్ Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు.

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా అని అన్నారు. అదేవిధంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. అంటూ బండి సంజయ్ (Bandi Sajay) ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరమని అన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా పాలక మండలి సభ్యుడు భాను‌ప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరానని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story