శ్రీపురంలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు

by Naveena |
శ్రీపురంలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు
X

దిశ ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం లో కొలువైన శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని అత్యంత పురాతన వైష్ణవ ఆలయాల్లో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజైన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కాబోతుంది. అంతకుముందే విశేష పూజలు, గరుడ పల్లకి సేవ ద్వారా స్వామివారు ఉత్తర ద్వారం వద్దకు చేరుకోనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ కుమార్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తో.. సహా అనేకమంది ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు దర్శించుకునేందుకు రానున్న నేపథ్యంలో.. ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏడాదికి ఒకరోజు మాత్రమే తెరుచుకునే ఉత్తద్వారాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. వేలాదిగా వచ్చే భక్తులకు సరఫరా చేసేందుకు ప్రసాదం సిద్ధం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు నిర్వహించారు.

Advertisement

Next Story