- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Free Bus: సీటు కోసం చితక్కొట్టుకున్న మహిళలు (Video Viral)
దిశ, వెబ్ డెస్క్: ఫ్రీ బస్(Free Bus) కొందరికి వరంగా మారితే మరికొందరికి గరంగా మారింది. మహిళలకు పెద్ద వేస్తూ తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే బస్సులో ఉచితంగానే ప్రయాణాలు చేస్తున్నా ఫ్రీగా గొడవలు కూడా జరుగుతున్నాయి. మహిళా ప్రయాణికులు(Female Passengers) బస్సు ఎక్కి సీటు కోసం కుమ్మలాటకు దిగుతున్నారు. బస్సులోనే కాదు బయటకు దిగి కూడా కొట్టుకుంటున్నారు. నడిరోడ్డు అని కూడా లేకుండా దవడలు వాయించుకుంటున్నారు. అందరూ చూస్తున్నా ఆగడంలేదు. జుట్లు పట్టుకుని మరీ సినిమా స్టైల్లో ఫైటింగ్ చేసుకుంటున్నారు. అడ్డు తీసేందుకు ఎవరైనా వెళ్లినా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు విచక్షణారహితంగా దాడి చేసుకుంటున్నారు.
ఇలాంటి ఘటన తాజాగా వనపర్తి జిల్లా(Vanaparthi District)లో జరిగింది. ఎక్కడ బస్సు ఎక్కారో తెలియదు గాని గణపురం(Ganapuram)లో దిగారు. బస్సులో జరిగిన గొడవను కంటిన్యూ చేశారు. ముగ్గురు మహిళలు వర్సెస్ మరో మహిళగా ఫైటింగ్ జరిగింది. చీపుర్లు, కర్రలతో మహిళను కొట్టారు. అందుకు ఆమె కూడా ఎదురు తిరిగి గట్టిగానే పోరాటం చేసింది. ముగ్గురిలో దొరికిన వారిని కుమ్మేసింది. మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు ఎవరో వీడియో చూసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు బస్సులో జరిగిన సీటు గొడవ కాదని వాదనలు వినిపిస్తున్నాయి. వేరే ఏదో కారణంగా ఘర్షణ జరిగి ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అంతరించి పోయిన కళను మహిళలు మళ్లీ ప్రదర్శించడంతో పలువురు సెటైర్లు వేస్తున్నారు.
చీపుర్లు, కర్రలతో ఫైటింగ్.. pic.twitter.com/4nBUQL0w1o
— vemula srinuprasad ( Chief SubEditor) DISHA DAILY (@srinuprasad1234) January 9, 2025