- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు తెలపాలి

X
దిశ, నల్లగొండ క్రైం: పోలీస్ సేవలపైన జిల్లా ప్రజల అభిప్రాయాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా తెలపాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నల్లగొండ జిల్లాలో పోలీసులు అందిస్తున్న సేవలపైన ప్రజల అభిప్రాయం తెలుపేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో సిటిజెన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్ ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సేవలు, వారి పని తీరుపై స్టేషన్ లో ఫిర్యాదు తీసుకునేందుకు,ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు, ఈ చాలన్,ఇతర అంశాల పైన ప్రజల అభిప్రాయాన్ని ఇక నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా తెలిపాలని ఎస్పీ తెలిపారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ సౌకర్యం ఉంటుందని,పోస్టర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చే లింక్ ఓపెన్ చేసి అభిప్రాయాలు తెలపాలని సూచించారు.
Next Story