- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Varma: యశ్వంత్ వర్మ ప్రమాణ స్వీకారం సరికాదు.. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwanth varma) రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ (HCBA) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసింది. యశ్వంత్ వర్మకు ఎటువంటి పరిపాలనా లేదా న్యాయ బాధ్యతలను అప్పగించొద్దని పేర్కొంది. ‘జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టులో రహస్యంగా ప్రమాణ స్వీకారం చేశారనే సమాచారంతో మొత్తం బార్ అసోసియేషన్ బాధపడుతోంది. ఈ ప్రమాణం భారత రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధమైన ప్రమాణంతో సంబంధం కలిగి ఉండటానికి అసోసియేషన్ సభ్యులు ఇష్టపడటం లేదు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. వర్మ ప్రమాణ స్వీకారం ఆమోద యోగ్యం కాదని తెలిపారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
అంతకుముందు యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా రహస్యంగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు వెబ్ సైట్ లో వర్మ వివరాలు సైతం పొందుపర్చారు. ఏప్రిల్ 5నే ఆయన ప్రమాణం చేసినట్టు ఉంది. సీనియారిటీ ప్రకారం ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బార్ అసోసియేషన్ సభ్యులు దీనిని ఖండించారు.