ప్రభుత్వ కార్యక్రమాలను ప్రపంచానికి చాటేందుకు వేదిక.. టీపీసీసీ చీఫ్ మహేష్​ కుమార్ ​గౌడ్​

by Ramesh Goud |
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రపంచానికి చాటేందుకు వేదిక.. టీపీసీసీ చీఫ్ మహేష్​ కుమార్ ​గౌడ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​లోని రెండు రోజులపాటు నిర్వహించిన భారత్ సమ్మిట్–2025 గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీపీసీసీ చీఫ్ మహేష్ ​కుమార్ ​గౌడ్​తెలిపారు. తెలంగాణ గొప్పతనాన్ని చాటేలా భారత్ సమ్మిట్ కొనసాగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్ సమ్మిట్ ను నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ సమ్మిట్ ఓ వేదికగా ఉపయోగపడిందన్నారు. భారత్ సమ్మిట్ కు 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిపి మొత్తంగా 450 మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు సమావేశానికి హాజరై తమ అనుభవాలను పంచుకోవడం జరిగిందని చెప్పారు.

ప్రపంచ శాంతి, ప్రపంచ న్యాయం, వాతావరణం మార్పులు, టెర్రరిజం అంశాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. రాహుల్ గాంధీ పాద యాత్రలో తెలుసుకున్న ప్రజల సాధక బాధలను క్లుప్తంగా చెప్పారు అని తెలిపారు. అన్యాయం ఎదుర్కొని కొత్త శకాన్ని సృష్టించి శ్రామికుల హక్కులను కాపాడాలని తీర్మానించారని పేర్కొన్నారు. ప్రగతీ శీల ఉద్యమాల అణిచివేతను ఖండించారని తెలిపారు. మీడియా పై దాడులను రాహుల్ గాంధీ ఖండించారన్నారు. సమ్మిట్ వేదికగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రగతిశీల పార్టీల చెందిన ప్రతినిధులు.. ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ డిక్లరేషన్ ను ప్రవేశ పెట్టారన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు అయినా అహింసా సత్యం న్యాయం ప్రజాస్వామ్యం వంటి అంశాలపై సమ్మిట్ లో చర్చించడ జరిగిందన్నారు. ప్రజాస్వామ్య ప్రగతి శిల విధానాలపై వ్యక్తల వివరణ.. భవిష్యత్లో దేశంలో రాబోయే మార్పుల గురించి కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రసంగం యువతకు దిశా నిర్దేశం చేసేలా ఉందని పీసీసీ చీఫ్​పేర్కొన్నారు.



Next Story

Most Viewed