Senthil Balaji: తమిళనాడులో కీలక పరిణామం.. ఇద్దరు మంత్రుల రాజీనామా

by vinod kumar |
Senthil Balaji: తమిళనాడులో కీలక పరిణామం.. ఇద్దరు మంత్రుల రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు (Thamil nadu)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు కేబినెట్ మంత్రులు తమ పదవులకు రిజైన్ చేశారు. మంత్రులు సెంథిల్ బాలాజీ (Senthil Balaji), పొన్ముడి (Ponmudi) లు స్టాలిన్ (Stalin) కేబినెట్ నుంచి వైదొలగారు. ఇరువురు నేతలు రాజానామా చేయగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించారు. సీఎం స్టాలిన్ సిఫార్సు మేరకు గవర్నర్ చర్యలు తీసుకున్నారని రాజ్ భవన్ తెలిపింది. కాగా, బాలాజీ ప్రస్తుతం ఓ కేసు విషయంలో ఈడీ దర్యాప్తును ఎదుర్కొ్ంటున్నారు. అయితే తన పదవికి రిజైన్ చేయాలని లేదంటే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు.

ఇక, మరో మంత్రి పొన్ముడి సెక్స్ వర్కర్ విషయంలో శైవ-వైష్ణవ తిలకంపై చేసిన వ్యా్ఖ్యలతో వివాదంలో ఇరుక్కున్నారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం నేపథ్యంలో పొన్ముడిని పార్టీ కీలక పదవి నుంచి ఇప్పటికే తొలగించారు. కానీ మంత్రి వర్గం నుంచి సైతం బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు.



Next Story

Most Viewed